ఎన్నికల్లో గెలిచేందుకు అధికార వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు చంద్రబాబు. పొత్తుల్లో భాగంగా జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంటే మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లను ప్రొత్సహిస్తూ గాజు గ్లాసు గుర్తును కేటాయించేలా చేశారని దుయ్యబట్టారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదేనన్నారు చంద్రబాబు. నంద్యాలలో నేడు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తామన్నారు . యువత అంతా సైకిల్ ఎక్కాలని పిలుపు నిచ్చారు. జాబు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. తాను, పవన్ కల్యాణ్ వల్లే ఇదంతా సాధ్యమవుతుందన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రెండో సంతకమన్నారు.
పెంఛన్లు వెయ్యి నుంచి మూడు వేలకు తాము పెంచామంటూ సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని గుర్తు చేశారు టీడీపీ అధినేత. ఆయన ఓ శాపం ఉందని, నిజం చెబితే తల బద్దలై వేయి ముక్కలు అవుతుందన్నారు. వృద్దులను చంపి శవ రాజకీయాలు చేసే మనిషి జగన్ అని ఆరోపించారు. తాను ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని అంటూ. ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేలు పించన్ ఇస్తామన్నారు. జులైలో బకాయిలతో కలిపి ఏడు వేలు ఇస్తామన్నారు.
జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు , . వారసత్వం భూమిపై సైకో ఫోటో ఉండకూదన్నారు. జగన్ మళ్లీ వస్తే మన భూములను అమ్ముకోవడానికి వీల్లేదన్నారు చంద్రబాబు. భూములపై అన్యాయం జరిగితే నేరుగా హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉన్న పథకాలను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి ఫారూఖ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిశ్రమలు తీసుకుని ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు టీడీపీ అధినేత.