ఏపీలోని నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని SBI కాలనీలో సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిలై ఆటో డ్రైవర్లతో తిరుగుతున్నాడు.
ఈ తరుణంలోనే ఓ హిజ్రాతో చనువుగా ఉంటున్నాడని పేరెంట్స్ అతడిని మందలించారు. ఈ క్రమంలో హిజ్రా గ్యాంగ్ వారి షాపు వద్దకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు. దీంతో అవమానం భరించలేక తల్లిదండ్రులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది.. అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులిద్దరూ మృతి చెందారు.
- Advertisement -