Thursday, September 5, 2024

Nandyala – ఆటలాడుతూ చిన్నారి అదృశ్యం … పోలీసుల జాగిలాలతో గాలింపు


ఆంధ్రప్రభ స్మార్ట్, నందికొట్కూరు ప్రతినిధి: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మద్దిలేటి సుజాతమ్మ ల ఎనిమిది ఏళ్ల చిన్నారి వాసంతి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం తోటి స్నేహితులతో కలిసి పాత ముచ్చుమర్రి లోని పార్కు లో చిన్నారులతో కలిసి ఆడుకున్న చిన్నారి కనిపించపోవడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జూపాడుబంగ్లా, మిడుతూరు , ముచ్చుమర్రి , బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై లు ఆధ్వర్యంలో పోలీసు జాగిలంతో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సమీపంలోను గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement