Wednesday, January 29, 2025

Nandyala | ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఫీట్లు.. పాట్లు..

నంద్యాల బ్యూరో, జనవరి 27 ఆంధ్రప్రభ : జనాలు వందలాది మంది ఉన్నారని, ఇక్కడేదో జాతర జరుగుతుంది అనుకుంటే పొరపాటే… ఆర్టీవో కార్యాలయం ఎదురుగా సోమవారం వందలాది మంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పిదానికి వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిపివేసిన సంఘటన నంద్యాలలో జరిగింది. నంద్యాల ఆర్టీవో కార్యాలయం అధికారులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం వేల రూపాయలు చెల్లించిన వాహన వాహనదారుల అగసాట్లు ఎన్నో…ఎన్నెన్నో?… వాహనదారులు ఏడాదికోసారి వాహనాల ఫిట్ నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలోని వందలాది మంది వాహనదారులు ప్రభుత్వ కమిషనర్ ఆర్టీవో వెబ్ సైట్ ద్వారా వాహనదారులు ఫిబ్రవరి 5వ తేదీ వరకు స్లాట్ కు వేలాది రూపాయల రుసుం చెల్లించి వాహనదారులు బుక్ చేసుకున్నారు. ఆటోలు, కార్లు, లారీలకు జిల్లాలోని వందలాది వాహనదారులు లక్షలాది రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 5వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్నారు.

అయితే సోమవారం వాహనదారులు ఫిట్ నెస్ కోసం కార్యాలయం వాహనాలు తీసుకుని వెళ్ళగా.. అధికారులు మాత్రం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ అయిన ఏటిఎస్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. దీంతో వాహనదారులు కార్యాలయం ఎదురుగా నిరసనగా ధర్నా చేశారు. వాహనాలు ఫిట్నెస్ కోసం ఒక్కొక్క ఆటోకు సుమారు పదిహేడు వందల రూపాయలు, ఫోర్ వీలర్లకు 5వేల నుంచి 10 వేల రూపాయలు, భారీ వాహనాలైన లారీలకు పదివేల నుంచి 15 వేల రూపాయలు ఆర్టీవో వెబ్ సైట్ కు చలానాల రూపంలో సొమ్ము చెల్లించారు. దీంతో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆర్టీవో వెబ్ సైట్ కు చలానా రూపంలో చెల్లించారు. తిరిగి ఆ సొమ్ము వెనక్కి రాదు. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ వాహనాలను ఫిట్ నెస్ చేయించుకొని సర్టిఫికెట్ తీసుకోవాలంటే తిరిగి వాహనదారులు మరొక్కసారి సొమ్మును తిరిగి చలానా రూపంలో జమ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

దీంతో వాహనదారులు ఆర్థికంగా చాలా అవస్థలు పడి ఇబ్బందులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీవో అధికారుల నిర్లక్ష్యం మూలంగా పైసలు వెబ్ సైట్ లో చెల్లించినప్పటికీ తిరిగి చెల్లించాలంటే బాధ్యులు ఎవరంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చలాన రూపంలో కట్టిన సొమ్ము తిరిగి రాదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు స్లాట్ తేదీలు ఇచ్చి చలానా రూపంలో ఫిట్నెస్ కోసం సొమ్ము చెల్లించుకున్నారు.. కాబట్టి ఆర్టీవో కార్యాలయంలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయాలని వాహనదారులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి జాతీయ రహదారిపై నిరసన ధర్నా చేస్తున్న వారిని సముదాయించారు. కార్యాలయంలో ఉన్న వాహనదారులను బయటకు పంపించి కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు.

రాష్ట్ర రోడ్డు రవాణా అధికారి వై.ఐశ్వర్యా రెడ్డిని ఆంధ్రప్రభ వివరణ అడగగా.. వాహనదారులు ఫిట్ నెస్ కోసం ఫిబ్రవరి 5వ తేదీ వరకు వివిధ తేదీల్లో స్లాట్ రూపంలో చలానా రూపంలో సొమ్ము చెల్లించిన మాట వాస్తవమేన‌ని పేర్కొన్నారు. వాహనదారులకు చలానా రూపంలో చెల్లించిన సొమ్ము తిరిగి వాపసిస్తారా అన్న ప్రశ్నకు గ్యారెంటీ చెప్పలేను అన్నారు. రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కు విషయం తెలిపామని పేర్కొన్నారు. వాహనదారులు తిరిగి ఏటీఎస్ సెంటర్ లో సొమ్ము చెల్లించి నష్టపోవాల్సిందేనా అన్న ప్రశ్నకు ఉన్నతాధికారులకు విషయం తెలియపరుస్తామని మాత్రమే జవాబు ఇవ్వటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement