నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ – ….నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జి.జమ్ముల దిన్నే లో సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. అదే గ్రామంలో గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హరినాధ రెడ్డి సమీపంలోని రైతు సేవా కేంద్రంలో విధుల నిమిత్తం వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య కూతురు ఉన్నారు. సచివాలయం సమీపంలోని రైతు సేవా కేంద్రంలో ఉరి వేసుకోవటంలో గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ పని ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడా..లేక కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యకు పాల్పపడ్డాడా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Nandyala – కార్యాలయంలోనే ఉద్యోగి ఆత్మహత్య …
Advertisement
తాజా వార్తలు
Advertisement