Sunday, November 24, 2024

Nandikotkuru – ఆ బాలిక జాడ లేదు – ముచ్చుమర్రి కాలువలో కొన‌సాగుతున్న అన్వేష‌ణ‌

రంగంలో గజ ఈతగాళ్ల‌ బృందం
30 అడుగుల లోతులోనూ ప‌రిశీల‌న‌
ఘటనా స్థలిలోనే నంద్యాల కలెక్టర్
ఎస్పీ ఆధ్వ‌ర్యంలో పర్యవేక్షణ

ఆంధ్రప్రభ స్మార్ట్, నందికొట్కూరు ప్రతినిధి: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో… ఇప్పటి వరకూ బాలిక జాడ దొరకలేదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాన్నీ రంగంలోకి దింపారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజాకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిగురువారం ఘటన స్థలికి వచ్చారు. విశాఖ పట్నం నుంచి గజ ఈత బృందాన్ని రంగంలోకి దించారు.

- Advertisement -

రెండ్రోజులుగా కొన‌సాగుతున్న అన్వేష‌ణ

పోలీసుల సూచనతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మత్స్యకారులు వలలతో తీవ్రంగా గాలించారు. మరోవైపు గజ ఈతగాళ్లను సైతం రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మరోసారి నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. 30 అడుగుల నీటిలోనూ గాలిస్తున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

పెను సంచలనం
నంద్యాల జిల్లాలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో చిన్నారి చనిపోగా.. నిందితులు మృతదేహాన్ని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్‌ కాలువలో పడేశారు. ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం నదిలో గాలింపు చేపట్టారు. నిందితులు మంగళవారం నేరాన్ని అంగీకరించారని.. అదే రోజు సాయంత్రం వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు కొంతదూరంలో కాలువలో బాలిక మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని చూపించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement