కర్నూలు బ్యూరో – .మరో రెండు రోజుల్లో తన భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ స్పష్టం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్తగా కడప జిల్లా కు చెందిన డాక్టర్ సుదీర్ ఎంపిక చేయటాన్ని ఎమ్మెల్యే వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కర్నూల్ లో కె ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నందికొట్కూర్ వైసిపి కార్యకర్తలు, నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నేతల అభిప్రాయాలను ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ అడిగి తెలుసుకున్నారు. వైసిపి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే సేవలను గుర్తించకపోవడంతో ఇక పార్టీలో ఉండకూడదని పలువురు నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు.
ఆనంతరం పాత్రికేయలతో మాట్లాడిన ఆయన ముఖ్య మంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఖచితంగా తనకే ఇస్తానని చెప్పి.. ఇప్పుడు మాట తప్పిందని ఆవేదన వ్యక్తంచేశారు. ముందు తన భవిష్యత్ కార్యాచరణ పై మరో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.
ఇటీవలవైసీపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ పేరు లేదు. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థర్ ను పక్కన పెట్టి ఆ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. వైసీపీ మూలస్తంభాలు అయినటువంటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అలానే జిల్లా కో ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఇరువురు రానున్న ఎన్నికల్లో ఆర్థర్ కు సీటు ఇచ్చే పూచీ తమదని హామీ ఇచ్చిన సందర్బాని ఈ సందర్భంగా మీడియాతో ఆయన గుర్తు చేశారు.
అయితే ఐప్యాక్ సర్వే ఆధారంగా ఇంఛార్జులను నియమించిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ టిక్కెట్ల విషయంలో మొండి చేయి చూపడం పై ఆవేదన వ్యక్తం చేశారు . తనకు ఐప్యాక్ సర్వే రిపోర్టు కూడా అనుకూలంగా వచ్చిందన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఒకే ఇన్‌చార్జ్ పెత్తనం సాగుతోందని అందుకే అర్హత ఉన్న తనకు టికెట్ ఇవ్వలేదని.. ప్రత్యక్షంగా విమర్శించక పోయిన పరోక్షంగా నందికొట్కూరు వైసిపి ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించా రు.