ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఉత్తర్వులు వెలువడుతున్నాయి. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లను మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జగన్ పథకాల పేర్లు మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం..
- జగనన్న విదేశీ విద్యాదీవెన – అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్పు.
- జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన – పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరు మార్పు.
- వైఎస్సార్ విద్యోన్నతి – ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు.
- వైఎస్సార్ కళ్యాణ మస్తు – చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహాం – సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు.