Thursday, November 21, 2024

ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కిరణ్ కుమార్ రెడ్డి ?

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీని బ‌లోపేతం చేసేందుకు దృష్టి సారించింది. అన్ని రాష్ట్రాల్లో పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. ఈ సందర్భంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీకి ఊపు తీసుకువచ్చే విధంగా ఏం చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు రావాలనే విషయంపై దృష్టి సారించింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కిరణ్ కుమార్ రెడ్డికి ఉండడం, విస్తృతమైన పరిచయాలు వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని ఆయన పేరును అధిష్టానం ఫైనల్ చేయాలని చూస్తోందట. ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అబ్బే… అదేమీ లేదు… నన్నెవరూ పిలవలేదు.. వ్యక్తిగత పని మీద ఢిల్లీకి వచ్చాను..అంతా మీడియా ఊహాగానాలే… అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ లో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement