Friday, November 22, 2024

ఈ నెల 20న నాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవం.. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్ర‌దానం

ఏఎన్యూ క్యాంపస్, (ప్రభ న్యూస్): ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఈ నెల 20న జరగనుంది. విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయ‌నున్నారు. ఈ మేరకు విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ ఏర్పాట్లు ప్రారంభించింది. విశ్వవిద్యాలయం అదనపు ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ మంగళవారం స్నాతకోత్సవ ఏర్పాట్లు కమిటీలతో సమావేశం నిర్వహించారు. కాగా, రేపు (బుధవారం) అధికారికంగా స్నాతకోత్సవ తేదీని ఖరారు చేస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి విశ్వవిద్యాలయానికి సమాచారం రానుందని ఆయన కమిటీ సభ్యులకు చెప్పారు.

ఆయా కమిటీలు వారికి అప్పగించిన బాధ్యతలను వేగవంతం చేయాలని ఆయన కమిటీ సభ్యులను వీసీ ఆదేశించారు. స్నాతకోత్సవానికి తక్కువ సమయం ఉన్నందున కమిటీలు ఏర్పాట్లను సక్రమంగా చేసి స్నాతకోత్సవం విజయం అవ్వటానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి బిస్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ .వి .రమణ గౌరవ డాక్టరేట్ ను అందు కోనున్నారు. దీంతోపాటు డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కోర్సుల లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎంఫిల్, పి హెచ్ డి పరిశోధకులకు డాక్టరేట్ ప్ర‌దానం చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement