Sunday, September 15, 2024

Naga Babu – గుండె ఆనందంతో నిండింది.. స‌భ‌లో త‌మ్ముడు.. భావోద్వేగంలో అన్న

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పదేళ్ల కల నేరవేరింది.. ప్రజాప్రస్థానం మొదలైందంటూ పవన్ అన్నయ్య నాగబాబు ట్వీట్ చేశారు. తోబుట్టుగా.. జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి గుండె ఆనందంతో నిండిపోయిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగబాబు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో నా తమ్ముడిని చూసి మనసు ఉప్పొంగిందంటూ రాసుకొచ్చారు. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని ఈ కార్యక్రమం చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు నాగబాబు.

కూటమిలో కల్యాణ్ ఘన విజయం సాధించడం మెగా ఫ్యామిలీకి గర్వంగా ఉందని ట్వీట్ చేశారు నాగబాబు. పవన్ అసెంబ్లీకి వెళ్లాలని.. పవన్ కల్యాణ్‌ అను నేను అని ప్రమాణస్వీకారం చేయాలనేది తన కల అన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఓటర్ నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకుంటారన్నారు. పవన్ నిజాయితీతో, నిష్పక్షపాతంగా, అంతఃకరణ శుద్ధితో తన మంత్రిత్వ శాఖలకు న్యాయం చేస్తాడని నాగబాబు ట్వీట్టర్లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement