Tuesday, November 26, 2024

సారా ఏరులు ! గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా తయారీ..

ఒంగోలు, ప్రభన్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకకలం రేపుతున్నాయి. సారా సేవించి 18మంది మృతి చెందగా, మరి కొంత మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలను సారా తయారీలో వినియోగిస్తుండటంతో.. సేవించే వారు పలు రకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, చీరాల తదితర నియోజకవర్గాల్లో అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నారు. ఫలితంగా నాటు సారా తయారీ బడుగుల జీవితాల పై పెను ప్రభావం చూపుతోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. సారా తయారీని అరికట్టడంలో నియంత్రణశాఖలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement