Friday, November 22, 2024

క‌రోనా వేళ – ఎన్‌440కె స్ట్రెయిన్ దుమారం

అమరావతి, : కరోనా వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త వైరస్‌పై రాజకీయ గోల మొదలైంది. సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదం నిరంతరం ఓ యుద్దంలా కొనసాగుతూనే ఉంటుంది. అధికార పక్షం తీసుకునే నిర్ణయాలపై ప్రధాన ప్రతిపక్షం వ్యతిరేకిస్తూనే ప్రజా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అదే తరహా రాజకీయ వివాదం రెండు ప్రధాన పార్టీల మధ్య దుమారం రేపుతోంది. అసలు రాష్ట్రంలో కొత్త వైరస్‌ ఉందో లేదో..? ఈ అంశంలో తప్పెవరిదో స్పష్ట ంగా తెలియనప్పటికీ రాష్ట్ర ప్రజలకు మాత్రం కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఎన్‌440కె స్ట్రె యిన్‌ వైరస్‌ ప్రభావం కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలలో కనిపించినట్లు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటన చేశారు. ఆ వైరస్‌ విజృంభించక ముందే రాష్ట్ర ప్రభుత్వం కట్టడికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. అయితే ఆ వైరస్‌ రాష్ట్రంలో వ్యాప్తి చెందిందో లేదో.. కనీస అవగాహన కూడా లేకుండా ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం ప్రతిపక్షం చేసిన తప్పుడు ప్రచారం ఫలితంగానే పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ఏపీ ప్రయాణీకులు 14 రోజుల క్వారంటైన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు రాష్ట్రంలో ఆ తరహా వైరస్‌ ఎక్కడా కనిపించక దాఖలాలే లేవని, చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రులు, వైసీపీ సీనియర్‌ నేతలు విపక్ష పార్టీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే విషయంపై చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా సీఎం జగన్‌ ఇదే అంశంపై సహచర మంత్రులతో చర్చించారు. ప్రజలు భయాం దోళనకు గురికాకుండా చంద్రబాబు తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు.
ప్రతిపక్ష విమర్శలను తిప్పికొడుతున్న అధికారపక్షం
కొత్త వైరస్‌పై తెలుగుదేశం పనికట్టుకుని తప్పుడు విమర్శలు చేస్తోందంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడంతో పాటు కోవిడ్‌ వంటి విపత్కర సమయంలో ప్రజలను మరింత భయాందోళనకు గురిచేసేలా ప్రకటనలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రివర్గ సమావేశంలోను సహచర మంత్రులకు ఇదే విష యాన్ని స్పష్ట ం చేశారు. ఈ తరహా ప్రచారం మంచిది కాదని, ప్రతిపక్షం సరైన పాత్ర పోషించ లేకపోతోందని, పసలేని వారి ప్రకటనలపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వారికి భరోసా ఇచ్చేలా టీడీపీ తప్పుడు ప్రచారాన్ని అధికారపక్షం తిప్పుకొడుతోంది.

ఎన్‌440కె స్ట్రె యిన్‌పై దుమారం
అత్యంత ప్రమాదకరమైన ఎన్‌440కె స్ట్రె యిన్‌ వైరస్‌ కర్నూలు జిల్లాలో ఒకట్రెండు ప్రాంతాల్లో కనిపించాయని, ఆ దిశగా బాధితుల్లో కూడా వైరస్‌ లక్షణాలు కనిపించాయని టీడీీపీ అంటోంది. ఇదే విషయంపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు కూడా ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్ర మత్తం కావాలని సూచన చేశారు. సాధారణ వైరస్‌తో పోలిస్తే 15 రెట్లు అధిక ప్రభావాన్ని చూపే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. ఇప్పటికే ఈ వైరస్‌పై పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయని, రాష్ట్రంలో కర్నూలు, విశాఖ తదితర ప్రాంతాల్లో ప్రారంభ దశలోనే ఉన్న ఈ వైరస్‌ను మొదట్లోనే అణిచివేయాలని అందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచి స్తోంది. టీడీపీ ప్రకటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగా పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమ య్యాయి. ఏపీ నుంచి వచ్చే తెలుగు ప్రయాణీకులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నా యి. ఢిల్లి, ఒరిస్సా తదితర రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశాయి. దీనిపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement