గుంటూరు, ఆంధ్రప్రభ : నా భర్త నిర్దోషి అని, తనను వదిలిపెట్టాలని మాజీ రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ భార్య మౌనిక డిమాండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు వేలాంగిణి నగర్ లో పోలీససులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని భార్య మౌనిక ఆరోపించారు. తన భర్తకు ఎలాంటి నోటీస్ లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగులగొట్టి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.
తన భర్తను తీసుకువెళ్లి కొన్ని గంటలు అవుతున్నా పోలీసులు ఆచూకీ చెప్పడం లేదన్నారు. తన భర్త బోరుగడ్డ అనిల్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పోలీసులు సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త కోసం న్యాయ పోరాటం చేస్తానని ఆమె అన్నారు. తన భర్త ను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అని మౌనిక వీడియో విడుదల చేశారు.