Monday, November 25, 2024

AP | పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా ఆశయం : చంద్రబాబు

బాపట్ల: బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారు. తన మీద కేసులు పెట్టినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవిత ఆశయమని తెలిపారు. తుపాను వచ్చి రైతులు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదు. వైకాపా ప్రభుత్వానికి రైతులంటే గౌరవం లేదన్నారు. జగన్ హయాంలో ప్రజల ఆదాయం తగ్గి ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు.

తెలుగుదేశం సంపద సృష్టించడంలో పేరున్న పార్టీ. ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. ‘‘తల్లికి వందనం’’ ద్వారా ప్రతి పిల్లవాడికి రూ.15 వేలు అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తాము. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement