Saturday, November 23, 2024

Muttukuru : మహా కుంభాభిషేకం మహోత్సవాలకు భారతీ స్వామి..

ముత్తుకూరు ( ప్రభ న్యూస్) : హంపి విరూపాక్షి విద్యారణ్య భారతీయ స్వామికి కృష్ణపట్నం కామాక్షి దేవి సమేత మనుమ సిద్దేశ్వర వేణుగోపాలస్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాల కార్య నిర్వహణ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న నూతన శిలా విగ్రహ జీవధ్వజ విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేకం మహోత్సవాలకు భారతీ స్వామి విచ్చేశారు. రెండో రోజు ఆదివారం ఆలయ పాలకమండలి, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల ఆహ్వానం మేరకు స్వామి కుంభాభిషేకము మహోత్సవాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య పిళ్ళై స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆలయ మర్యాదలు చేశారు. భారతీ స్వామి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులకు పలు అంశాలపై ప్రవచనములు తెలియజేసినారు. ముఖ్యంగా మహిళలు దీపారాధన చేసేటప్పుడు నెయ్యితో గాని అదే విధంగా ఆవు నెయ్యితో గాని చేయాలని స్వామి సూచించారు. కొవ్వూతులతో దీపారాధన చేస్తే గో హత్య చేసినంత పాపమని ఆయన అన్నారు. దీపాలు వెలిగించాలి తప్ప ఆర్పి వేసే సంస్కృతి హిందూ సంప్రదాయంలో లేదని స్వామి పేర్కొన్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement