తిరువూరు: రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో ఓ రాత్రి జరిగిన హత్య కేసును 36 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ నెల 23న కళ్యాణపు కృష్ణ చైతన్య ( 26) తిరువూరు బస్టాండ్ సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణం ఐదు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించారు. ఎక్కడికక్కడ అనుమానితులను గాలించారు. ఎట్టకేలకు హత్యకు పాల్పడిన మునుకుంట్ల శ్రీను (బాబు) , అతని అనుచరులు ఏడుగురిని విజన్ స్కూల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మునుకుంట్ల శ్రీనుకు మృతుడు కళ్యాణ్ కృష్ణ చైతన్య కి మధ్య డబ్బు విషయంలో వివాదం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో
కేసు ఛేదనలో నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన తిరువూరు సిఐ. భీమరాజు, సబ్ ఇన్ స్పెక్టర్లు దుర్గాప్రసాద్, పద్మారావు, గంపలగూడెం, విస్సన్నపేట ఎస్ ఐలు సతీష్, కిషోర్, హెడ్ కానిస్టేబుళ్లు మాధవరావు, శ్రీనివాసరావు, బాబురావు, కామేశ్వరరావు, కానిస్టేబుళ్లు తిరుపతిరావు, సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు.