కర్నూలు ప్రతినిధి, ప్రభన్యూస్ : ఈనెల 22వ తేదీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఇంకా ఖరారు కాలేదని, అయినా కూడా అధికారులు ప్రోటోకాల్ ప్రకారం అందుకు తగ్గ ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 21 న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ, 28న వివిధ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ, 22న సీఎం పర్యటించే అవకాశమున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎయిర్ పోర్ట్ దగ్గర ఓవరాల్ ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ (ఆసరా అండ్ సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు పర్యవేక్షిస్తారని, హెలిప్యాడ్, పంచ లింగాల సమీపంలో ఫంక్షన్ హాల్లో కర్నూల్ ఆర్డీఓ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారన్నారు. హెలిప్యాడ్ నిర్మాణం, అక్కడి నుంచి ఫంక్షన్ హాల్ వరకు రోడ్డు బాగా ఉండేలా చూడాలని ఆర్ అండ్‌బీ ఎస్ఈని ఆదేశించారు. ఎయిర్ పోర్టు, హెలిప్యాడ్, ఫంక్షన్ హాల్ తదితర సీఎం పర్యటించే ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాట్లు – పకడ్బందీగా చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శానిటేషన్, సీఎం పర్యటనకు అవసరమైన వాహనాలు, ఇతర ఏర్పాట్లపై ఎక్కడా ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 21 న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ, 28న వివిధ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ ఉంటుందన్నారు. అలాగే పంచలింగాల మాంటిస్సోరి స్కూల్ సమీపంలో జరుగుతున్న హెలిప్యాడ్, ఫంక్షన్ హాల్ పనుల పరిశీలించారు. సమీక్షలో జేసీ డా.మనజీర్ జిలానీ సామూన్, జేసీ (రెవిన్యూ అండ్ రైతు భరోసా) రామ సుందర్‌రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, జేసీ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా అండ్ సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, డీఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు, పాల్గొన్నారు. పంచలింగాల మాంటిస్సోరి స్కూల్ సమీపంలో జరుగుతున్న హెలిప్యాడ్, ఫంక్షన్ హాల్ పనుల పరిశీలనలో కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, కర్నూల్ ఆర్డీఓ హరి ప్రసాద్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital