రాజమహేంద్రవరం: టిడిపి అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జైలులో చంద్రబాబుతో మిలాఖత్ అయ్యారు.. నేడు కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను లూథ్రా వివరించారు.. అలాగే కోర్టులలో వేయాల్సిన మరికొన్ని పిటిషన్ లపై కూడా చంద్రబాబుతో లూథ్రా సుదీర్ఘంగా చర్చించారు.. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ”అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం” అంటూ గురుగోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ లూథ్రా ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement