కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ పద్మనాభం.. ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను..
మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను.. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్‌తో చేయించాలని ఆశతో ఉన్నాను అంటూ ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ఇక, మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈనెల 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి తన ప్రయాణంలో మీరు పాలపంచుకొని తాడేపల్లికి రావాలని కోరుతున్నాను.. అంటూ ముద్రగడ లేఖను విడుదల చేశారు..