Friday, November 22, 2024

AP : 14న వైసిపిలో చేర‌నున్న ముద్ర‌గ‌డ…ఎన్నిక‌ల‌లో పోటీకి దూరం…

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరనున్నట్లు ఆయ‌నే నేడు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

ఆయన కుమారుడు గిరి కూడా వై సీఎం జ‌గ‌న్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇది ఇలా ఉంటే ప‌దవుల కోసం వైసిపిలో చేర‌డం లేద‌ని ముద్ర‌గ‌డ స్ప‌ష్టం చేశారు.. ఈ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌డం లేద‌ని తేల్చి చెప్పారు.. కేవలం వైసిపి త‌రుపున ఆ పార్టీల అభ్య‌ర్ధుల కోసం ప్ర‌చారం నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు.
ఇది కాపు ఉద్య‌మ నేత చ‌రిత్ర‌..
కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది.

పద్మనాభం ఓ సారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 లో కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో ఉన్నారు ముద్రగడ. అప్పటి నుంచి క్రియా‎శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement