Monday, November 25, 2024

AP: ముచ్చుమరి ఘటన బాధాకరం… ఎమ్మెల్యే విరూపాక్షి

నందికొట్కూరు : ముచ్చుమర్రి సంఘటన బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శనివారం ఆయన ముచ్చుమరి గ్రామానికి చేరుకొని బాధిత బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా విరుపాక్షి మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నా ఈ సంఘటన పట్ల స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

ఇదే వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే అనిత ఒంటి కాలిమీద లేచేవారన్నారు. కానీ ఇప్పుడు ఈ ఘటన ఆమెకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. బిడ్డను పోగొట్టుకున్న బాధిత బాలిక తల్లిదండ్రులను చూస్తే గుండె తరుక్కు పోతుందన్నారు. బాలిక అదృశ్యమై 7 రోజులు అయిందన్నారు. నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తే తప్ప ఈ కేసు వీడదన్నారు ఎమ్మెల్యే వీరుపాక్షి.

ఈ ఘటనపై హోంమంత్రి స్పందించక పోవడం బాధాకరంగా పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానంతరం మహిళలకు అండదండగా ఉంటామని చెప్పారు. ఇదేనా అండగా ఉండడమంటే అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బాలిక చనిపోయిందా… బ్రతికి ఉందా.. అని క్లారిటీ కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి ఎవరూ రాకుండా అణచివేస్తున్నారు.. నిన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డిని రాకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement