మండపేట: రాజ్యాంగ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని మండపేట ఎంపీడీఓ ఐదం రాజు పేర్కొన్నారు. మండపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ… 72వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలపై భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, సమర్పించుకున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగంగా 1950 జనవరి 26న ఆమోదించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..