Monday, November 18, 2024

ఆయన గురించి సీఎం చర్చించాల్సిన అవసరమేముంది?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎంపీలతో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆపార్ట రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హాజరు కాలేదు. భేటీ అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. ఈ సంరద్భంగా రఘురామ వ్యవహారంపై ఎంపీ విజయసాయి రెడ్డి అచితూచి మాట్లాడారు. అది అంత ప్రధానమైన అంశమా? ఒక వ్యక్తి గురించి సీఎం చర్చించాల్సిన అవసరమేముంది? అని ప్రశ్నించారు. ఆయన గురించి చర్చించే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారా? అని మీడియాని ఎదురు ప్రశ్నలు సంధించారు. ”ఒక అన్‌క్యారక్టరిస్టిక్ పర్సన్.. విలువల్లేని వ్యక్తి గురించి సీఎంతో చర్చించాల్సిన అవసరం లేదని.. ఆయన సంగతి మా స్థాయిలో మేం చూసుకోగలం” అని విజయసాయి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: దేశంలో తొలి ఎలక్ట్రానిక్ కరోనా టెస్టు కిట్

Advertisement

తాజా వార్తలు

Advertisement