ఏపీలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో తగ్గిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన తరువాత చేపట్టిన చర్యలు ఫలితంగా రాష్ట్రంలో ఉగ్యోగ, ఉపాధి అవకాశాలు ఘననీయంగా పెరిగాయని తెలిపారు. ఫలితంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో తగ్గిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం 2016 లో 17.9శాతం ఉన్న నిరుద్యోగం ఈ ఏడాది అక్టోబర్ నాటికి 5.4 శాతానికి తగ్గిందన్నారు. వైద్యరంగంలోనూ 4 లక్షలకు పైగా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో కొత్త విద్యా విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు-కు నిర్ణయించిందని అన్నారు. ప్రాధమిక పాఠశాలల ఆవరణలోనే అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలో అంగన్వాడీ కేంద్రాలు తరలించి ఫౌండేషన్ స్పూళ్లుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక్కోతగగతి గది రూ.10 లక్షల రూపాయల వ్యయంతో ఈ విద్యా సంవత్సరంలో మెత్తం 6,692 అదనపు తరగతులు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ 669.20 కోట్ల వ్యయంతో ఈ భవనాలు నిర్మించాలని ఏపి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్నారు.
దశాబ్దాలుగా ప్రక్క రాష్ట్రం ఒడిషాతో నెలకొన్న జలవివాదాల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిందని పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యల పరిష్కారంతో పాటు- నేరెడి బ్యారేజి నిర్మాణం లక్ష్యంగా ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్ తో చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న భువనేశ్వర్ వెళ్తున్నారన్నారు.
శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా రాష్ట్రంలో మెత్తం 47.37 లక్షల మంది లబ్దిపొందనున్నారని, నామమాత్రపు రుసుంతోనే పూర్తి స్థాయి హక్కులు పొందవచ్చన్నారు. భవిష్యత్‌లోనూ లిటిగేషన్‌లకు అవకాశం ఉండదని అర్హుల గుర్తింపు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ అత్యాధునిక కంటి వైద్యం అందుబాటు-లోకి తేవాలన్న సిఎం జగన్ అభ్యర్థనను స్పందించి ప్రఖ్యాత ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యం రాష్ట్రంలో అత్యాధునిక కంటి ఆసుపత్రి ఏర్పాటు- చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. అత్యాధునిక కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లెకూడదనే ముఖ్యమంత్రి ఉద్దేశమని, అన్ని అనాధ శరణాలయాలలోనూ చిన్నారులకు ఉచితంగా నేత్రపరీక్షలు, చికిత్సలు నిర్వహించనున్నారన్నారు.
దేశంలో పదివేల ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు- చేస్తామని ఐఒసి ప్రకటించడం శుభపరిణామమని ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశం దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మంచిదన్నారు. టాటా పవర్ ఇప్పటికే దేశంలో 1000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు- చేయనున్నట్లు- ప్రకటించిందని గుర్తుచేసారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌దేనన్నారు. చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభ కనబర్చి కాప్-26 సదస్సులో ఆకట్టు-కునే ఉపన్యాసం ఇచ్చి దేశ ప్రతిష్టను పెంచిన తమిళ టీ-నేజర్ వినీష ఉమాశంకర్‌కు అభినందనలు తెలియజేసారు. సోలార్ పవర్‌తో నడిచే ఐరన్ బండిని తయారు చేసిన ఈ టీ-నెజర్ ప్రఖ్యాత ఎర్త్ షాట్ ప్రైజ్ గెలుపొందగలదని ఆశాభావం వ్యక్తం చేసారు. పర్యావరణ హితాని-కై- చేసిన నూతన ఆవిష్కరణకు ఈ గ్టోబల్ ప్రైజ్ అందిస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: ప్రజాసంకల్పానికి నాలుగేళ్లు.. సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు