Monday, November 18, 2024

ఏపీలో ‘నారా వైరస్’ ఆనవాళ్లు: విజయసాయి

ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ ను కట్డడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు దుష్ప్రచారాన్ని ఆపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్440కే వేరియంట్ వైరస్ ప్రబలిందంటూ నారా420 వైరస్ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాదుకు పారిపోయినా నారా వైరస్ ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయని విమర్శించారు. ప్రజల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుందీ ఈ జూమ్ భూతం అంటూ విజయసాయి మండిపడ్డారు.

‘కర్ణాటకలో ఇవాళ 49,058 కరోనా కేసులు. కేరళలో ఈ రోజు 42,464, తమిళనాడులో 25 వేలు. ఢిల్లీలో పాజిటివిటీ రేట్ 25 శాతం. ఒక్క ఏపీలోనే కేసులు పెరిగిపోతున్నాయంటూ యెల్లో వైరస్ ప్రచారం చేస్తోంది. మరి అత్యధిక టెస్టులు చేస్తోంది ఏపీ అని దానికి తెలియదా?’ అని ట్వీట్ చేశారు.

‘చంద్రంకు ఓ వారం అధికారమిస్తే కరోనాను ఖతం చేస్తాడంటూ పచ్చనేతలు డబ్బా కొడుతున్నారు. రేపు కరోనాపై కరాటే అంటారేమో? దోమలపై దండయాత్ర, నీరు – చెట్టు స్కీం అంటూ కోట్లు బొక్కేశారు. రెండు రెయిన్ గన్లు తెచ్చి కరువును ఖతం చేశామన్నారు. ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని పాతాళంలో పాతరేశారు’ అంటూ విజయసాయి ట్విట్టర్ లో విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement