ఏసీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు నవ సూచనల్లో రెండో లేఖ రాశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. బకాయిలు విడుదల కాకపోతుండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడం సరికాదన్నారు. దీంతో సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది.. సోకు రాష్ట్ర ప్రభుత్వానిది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళితే రాబిస్ టీకా వేశారు..