Friday, November 22, 2024

ప్రతిపక్ష పార్టీలకు ఓదార్పు చేసే హక్కు లేదా?

బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు పరమర్శించాలని వెళ్తే వారిని అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఓదార్పు కార్యక్రమం సీఎం జగన్ సొంతహక్కుగా భావించారా? వేరే ఎవరికీ ఓదార్పు చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. సీఎం ఓదారిస్తే శాంతి భద్రతల ఉంటాయి… వేరే వారు ఓదారిస్తే శాంతి భద్రతలు ఉండవా? అని నిలదీశారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓదార్పు హక్కు కల్పించిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. దిశ చట్టం ఇంకా అమలు కావడం లేదని, అమలు కానీ చట్టాలు పేరు మీద జనాలను మోసం చేయొద్దన్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్న నక్క ఆనంద్ బాబుపై ఎస్పీ చేయి చేసుకున్నట్లు తెలిసిందని, అది మంచిది కాదన్నారు. సీఎం పోలీసులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్, రమ్య కుటుంబాన్ని పరమర్శించాలని రఘురామ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: సీబీఐ విచారణలో వైసీపీ ఎంపీ అవినాష్ తండ్రి

Advertisement

తాజా వార్తలు

Advertisement