Tuesday, November 26, 2024

నాపై అనర్హత వేటు వేయలేరు: RRR

నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ ర‌ఘురామ స్పందించారు. తనపై వైసీపీ ప్రభుత్వం అన‌ర్హత వేటు వేయ‌డం సాధ్యం కాదని, తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్టలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌ల్లో లోపాల‌ను మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. వైసీపీ కార్య‌క‌లాపాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేదని చెప్పారు. కొంత‌మంది త‌ప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయ‌త్నం చేశానన్నారు. వాస్తవాలు ఎప్పటికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయని ర‌ఘురామ తెలిపారు. తనపై దాడి చేసిన వారి విష‌యంలో మ‌రోసారి ప్రివిలైజ్‌ మోష‌న్ ఇస్తానని ర‌ఘురామ తెలిపారు. తనపై ఈనెల 10వ తేదీన ఫిర్యాదు చేసి 11వ తేదీన ఫిర్యాదు చేసిన‌ట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని ర‌ఘురామ మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జ‌గన్ క‌లిసిన అనంత‌ర‌మే ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతున్నారని తెలిపారు.

కాగా, ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసులో బెయిల్ పై విడుదలైన రఘురామ… ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు వైసీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణ రాజు లేఖ రాశారు. త్వరలో జరగనున్న గవర్నర్ల సదస్సులో సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని రఘురామ గవర్నర్లును కోరారు. ఇదే అంశంపై ఏపీ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రలకు కూడా రఘురామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే.  

Advertisement

తాజా వార్తలు

Advertisement