Wednesday, November 20, 2024

Kondapalli: గెలుపెవరిది అన్నది కోర్టే నిర్ణయిస్తుంది!

ఏపీలో వివాదాస్పదంగా మారిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికలో టీడీపీ, వైసీపీ సభ్యులు పాల్గొన్నారు. టీపీపీకి ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటుతో 16 ఓట్లు రాగా.. అధికార వైసీపీ పార్టీకి 15 ఓట్లు వచ్చాయి. టీడీపీ తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ కేసినేని నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు వైసీపీ పార్టీ తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కొండపల్లి చైర్మన్ ఎన్నిక ప్రశాతంగా జరిగిందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గెలుపెవరిది అన్నది కోర్టే నిర్ణయిస్తుందని చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మందికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. న్యాయం వైపే ఉన్నారని చెప్పారు. గెలిచినా.. ఓడినా తాము ఎప్పుడూ ప్రజా పక్షమేనని స్పష్టం చేశారు. తానెప్పుపడూ రాజకీయం చేయనని, అభివృద్ధి మాత్రమే కాంక్షిస్తా కేశినేని నాని చెప్పారు.

ఇది కూడా చదవండి: Breaking: టీడీపీకే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం?.. ఫలితంపై వీడని టెన్షన్!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement