( ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ) – వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం హైదరాబాద్లో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఎంపీగా తాను చేసిన సేవలను గుర్తించక పోగా.. మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో తన ఎదుటే మరో అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషించటాన్ని జీర్ణించుకోలేక పోయిన ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన విషయం విధితమే. ఆయన జనసేనలో చేరుతున్నారనే వార్తలు గుప్పుమనటంతో కృష్ణాజిల్లాలోని జన సైనికులు, జన సేన నాయకులు పెద్ద సంఖ్యలో బాలశౌరిని కలిసి అభినందించారు.
అదే విధంగా పెడన, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ వైసీపీలోని బాలశౌరి అభిమానులు మద్దతు పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోసం బాలశౌరి ఎదురు చూడగా.. శుక్రవారం హైదరాబాద్లో తనను కలవాలని పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. దీంతో తన కుమారుడు అనుదీప్ సహా బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్తో బాలశౌరి భేటీ అయ్యారు. తాను వైసీపీ నుంచి బయటకు రావటానికి కారణాలను బాలశౌరి వివరించారు