Friday, November 22, 2024

Tiger: ఆంధ్ర‌-ఒడిశా స‌రిహ‌ద్దులో పులి సంచారం కలకలం

ఆంధ్ర‌ప్ర‌దేశ్-ఒడిశా స‌రిహ‌ద్దులో పులి సంచాల‌రం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే పులి సంచారం గురించి అట‌వీ శాఖ అధికారులు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) గ్రామాల సరిహద్దు గ్రామాల్లో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం, గరబండ, రౌతుపురం, రంప, కురాడ, బందహంస సరిహద్దు గ్రామాల్లో గత మూడు రోజులుగా పులి సంచరిస్తోందని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) గ్రామాల వాసులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఒడిశా రాష్ట్ర అటవీ అధికారులు అక్టోబర్ 21 నుండి సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. ఈ గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి, గోకర్ణపురం, చిన్నహంస, భరణికోట, కొలిగాం, కరజాడకు సమీపంలో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. ప‌లు సూచ‌న‌లు చేస్తూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. పులి సంచారం నేపథ్యంలో పాతపట్నం రేంజ్ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సరిహద్దు గ్రామాల వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement