Friday, November 22, 2024

10 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు : వెల్ల‌డించిన‌ సి ఈ ఓ గౌతమి

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ప్రోత్సహించడానికి వైజాగ్ లో మొదలైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లో భాగంగా నేడు తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల లో రూ 10 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ విషయాన్ని తిరుపతి లోని ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి ఈ ఓ) ఈ ఎం సి శ్రీమతి గౌతమి వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం తిరుపతి, కడప ఈ ఎం సి క్లస్టర్ల పరిధిలో సుమారు రూ. 10,072 కోట్ల పెట్టుబడి పెట్టడానికి 8 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి.అందులో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్- 1, 2 పరిధిలో సన్నీ ఒప్పో టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మొబైల్ కెమెరా మాడ్యూల్స్ రూ. 2500 కోట్లు, టి సి ఎల్ గ్రూప్ ప్యానెల్ మాన్యుఫాక్చరింగ్ రూ. 5000 కోట్లు,

క్లైర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్ ఈ డి మాన్యుఫాక్చరింగ్ రూ. 90 కోట్లు, నియో లింక్ గ్రూప్ 5 జి ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చరింగ్ రూ. 300 కోట్లు, ఎస్ 2 పి సోలార్ సిస్టం ఎల్ ఎల్ పి కంపెనీ సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ రూ. 850 కోట్లు, సెల్కన్ రేసోల్యుట్ కంపెనీ ఎల్ ఎల్ పి ప్యానెల్ అండ్ టి వి మాన్యుఫాక్చరింగ్ రూ. 1200 కోట్లు, వర్చువల్ మేజ్ కంపెనీ జి పి ఎస్ ట్రాకర్ ఈ వి బ్యాటరీ పి సి బి రూ. 80 కోట్లు, టెక్నో డోమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ టి వి మాన్యుఫాక్చరింగ్ రూ. 52 కోట్లు పెట్టుబడి పెట్టడానికి . ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఐ టి సెక్రెటరీ సౌరభ్ గౌర్, సి ఈ ఓ ఈ ఎం సి గౌతమి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement