మదనపల్లి టౌన్/ క్రైమ్ (ప్రభ న్యూస్): అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ చనిపోయిన ఘటన బుధవారం జరిగింది. మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు సకాలంలో డాక్టర్లు వైద్యం అందించకపోవడంతో పండంటి బిడ్డకు కష్టం మీద జన్మనిచ్చి ఆ వెంటనే ఆమె ఆసుపత్రిలో కన్ను మూసింది. తల్లి చనిపోయిన మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే పురిటి బిడ్డ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన నజీర్ బాషా భార్య ఎస్ రుక్షాణ ( 25), మూడవసారి గర్భం దాల్చింది. ప్రసవ నొప్పులు రావడంతో ఆమె పుట్టినిల్లు అయిన మదనపల్లి మండలం సిటిఎం రోడ్డులో ఉన్న ఆరోగ్య వరం తురకపల్లికు వచ్చింది. నొప్పులు అధికం కావడంతో కుటు-ంబ సభ్యులు ఆమెను బుధవారం తెల్లవారి తీసుకొచ్చిమదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మెటర్నిటీ- వార్డులో చేర్పించారు. ఆ సమయంలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో అడ్మిట్ అయిన కొంతసేపటికి అతి కష్టం మీద పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మరికొంతసేపట్లోనే ఆమె మృత్యువాత పడింది. బాలింత రుక్సానా చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే ఆమెకు పుట్టిన పండంటి మగ బిడ్డ కూడా కన్నుమూశాడు. తల్లి బిడ్డ ఆస్పత్రిలో మృత్యువాత పడడంతో మృతురాలి కుటు-ంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మా నిర్లక్ష్యం లేదు: డాక్టర్ల వివరణ
ఈ విషయమై వైద్యులను వివరణ కోరగా 160/110 బీపీతో గర్భిణీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని చెప్పారు. రిస్కు ఉంటు-ందని చెప్పే ప్రసవం చేశామని అయినా బాధగా ఉందని డాక్టర్లు తెలిపారు. అంతేగాని బాధితులు ఆరోపిస్తున్నట్లు- తమ నిర్లక్ష్యం లేదని వారు చెప్పారు.