Sunday, November 24, 2024

AP | ఎన్నిక‌ల కోడ్ అమ‌లు.. మూడురోజుల్లో మూడు కోట్లకుపైగానే సీజ్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన సోదాలు, తనిఖీల్లో రూ.3.39 కోట్ల నగదు, మద్యం సీజ్ చేసిన‌ట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. 173 బృందాల ద్వారా సోదాలు నిర్వహిస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జనవరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 176 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో 78 కోట్ల నగదు, 41 కోట్ల విలువైన నగలు, 30 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఇక ఈ మూడు రోజుల్లో 46 మంది వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన‌ట్టు వెల్ల‌డించారు. బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన ముకేష్ కుమార్ మీనా ఈ వివరాలు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా వదిలేది లేదని.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్రచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement