Tuesday, November 26, 2024

మూలపేట అభివృద్ధికి మూలస్తంభం.. సీఎం జగన్

మూలపేట అభివృద్ధికి మూలస్తంభం కానుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మూలపేట తీరం వద్ద గంగమ్మ తల్లికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.4,362 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తుల నిర్మాణం జరగనుందన్నారు.

30 నెలల్లో పోర్టు నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 35 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 మంది నిర్వాసిత కుటుంబాలకు పునరావాసానికి రూ.109 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. చెన్నై, ముంబై మాదిరి శ్రీకాకుళం జిల్లా మారనుందన్నారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మారనుందన్నారు. మూలపేట పోర్టు సామర్థ్యం వంద బిలియన్లకు చేరుతుందన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తే లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మరో రెండు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 46 నెలల్లోనే నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement