Friday, November 22, 2024

కుల పిచ్చి బాగా ముదిరింది – మోహన్ బాబు

తిరుపతి- ఒకప్పుడు మనుషులు కులాలకు అతీతంగా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని బంధుత్వాలతో పిలుచుకునేవారని నటుడు మోహన్‌బాబు అన్నారు.. గతంలో మనుషుల మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుతం మనుషుల్లో కుల పిచ్చి ఎక్కువైందన్నారు. మంచితనం ఆధారంగా మనుషులను గౌరవించాలని ఆయన అన్నారు. బాల్యం నుండి నేను కులాలను వ్యతిరేకిస్తున్నన్నారు. చిన్నతనంలో నా మిత్రుడిని కొందరు కులం ఆధారంగా కించపరిస్తే చెప్పుతో కొట్టబోయానని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు.

విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటిన మోహన్ బాబు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సినీ నటుడు మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారని చెప్పారు. ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణమని అన్నారు. తనకు జన్మనిచ్చిన గ్రామం మోదుగులపాళెం అని… ఒక నటుడిగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి తన తల్లిదండ్రులు, తన గ్రామ ప్రజలు మూలకారణమని చెప్పారు. పల్లెటూరు నుండి ఢిల్లీ పార్లమెంటు వరకు తన ప్రస్థానం కొనసాగడానికి తనకు జన్మనిచ్చిన తన పల్లెటూరే కారణమని అన్నారు.

తన జన్మభూమి ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను రూపొందించుకున్నానని మోహన్ బాబు తెలిపారు. తాను స్థాపించిన యూనివర్శిటీలో మొక్కలను నాటాలనుకున్నానని చెప్పారు. తన స్వగ్రామం వద్ద ప్రవహించే స్వర్ణముఖి నది ఇసుకను ఒక గుప్పెడు, వారి పొలంలోని మట్టిని ఒక గెప్పుడు తీసుకురావాలని 100 మంది తమ గ్రామస్తులకు చెప్పానని… వారు తెచ్చిన ఇసుక, మట్టితో 100 మొక్కలు నాటించానని తెలిపారు. అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూసిన ప్రతిసారి తనకు తన తల్లిదండ్రులు, తన జన్మభూమి, తన గ్రామస్తులు గుర్తుకు రావాలనేదే తన ఆశ అని చెప్పారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా పాల్గొన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement