అమరావతి, ఆంధ్రప్రభ : వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, ఇంధనాన్ని పొదుపు చేయగలిగే సామర్థం గల కొత్త రకం సిమెంట్ మిక్స్ సాంకేతికతను రాష్ట్రానికి అందించేందుకు స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కో-ఆపరేషన్ (ఎస్డిసి) ముందుకొచ్చింది. లైం స్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ (ఎల్సి-3) అనే నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ సాంకేతికత పరిశ్రమలకు లాభదాయకమే కాకుండా భవిష్యత్తులో సిమెంటు పరిశ్రమ రంగంలో కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల ఎస్డిసి, ఐఐటి మద్రాస్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఎస్డిసి నూతన సాంకేతికత గురించి ఎస్డిసి వివరించారు. సిమెంటు తయారీలో ఉపయోగించే సున్నపు రాయితో ఎల్సి-3ని కలపవడం వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న క్లింకర్ అనే ముడి పదార్థం వినియోగాన్ని పెద్దఎత్తున తగ్గించవచ్చు. ఇది స్థానికంగా లభిస్తే సిమెంటు పరిశ్రమలకు అత్యంత లాభదాయకమం. 2070 నాటికి కాలుష్య రహితం కావాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ నూతన సిమెంటు మిక్స్ టెక్నాలజీ కొంత మేర దోహద పడుతుంది.
పరిశ్రమలశాఖ సహకారంతో ఈ అంశాన్ని సిమెంటు- పరిశ్రమల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇండో స్విస్ బీప్ ద్వారా రాష్ట్ర గృహ నిర్మాణ పథకంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు తగ్గించే సాంకేతికతను ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం సిమెంటు పరిశ్రమలకు ఎల్సి-3 సాంకేతికతను అందించేందుకు ముందుకొచ్చింది. ఇంధన పొదుపు, భద్రత, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పరిశ్రమల రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసు కుంటుంది. పెర్ఫర్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. పాట్ పథకం 36 పరిశ్రమల్లో అమలవుతుండగా, అందులో 20 సిమెంటు- పరిశ్రమలు ఉన్నాయి. పాట్ పథకం వల్ల రూ.5,709 కోట్ల ఇంధనం ఆదా కాగా ఇందులో సిమెంటు పరిశ్రమల్లో రూ.2,400 కోట్లు ఆదా అయింది. అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.