బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాల కారణంగా సోమశిల నిండుకుండలా మారింది. కండలేరు జలాశయం కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది.
ప్రభ న్యూస్ ప్రతినిధి, నెల్లూరు : జిల్లా వరప్రదాయిని సోమశిల నిండుకుండలా తయారైంది. వరుసగా అయిదో పర్యాయం ఈ సంవత్సరంలో రెండవ సారి పూర్తిస్థాయి జలమట్టానికి చేరువైంది. సోమశిల రిజర్వాయర్ పూర్తిస్థాయి జలమట్టం 78 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రానికి 74 టీఎంసీల నీటి మట్టం నమోదైంది. కాగా , రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సోమశిలకు వరద ప్రవాహం ప్రారంభమైంది.
దాదాపు 28, 553 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా , ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వరద జలాలకు తోడు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతుండడం , కండలేరు రిజర్వాయర్ కూడా ప్రస్తుత పూర్తిస్థాయి సామర్ధ్యమైన 57 టీఎంసీల నీటి నిల్వను చేరుకోవడంతో సోమశిల క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పెన్నానది దిగువకు 31,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా , కావలి కెనాల్‌కు 600 క్యూసెక్కులను వదులుతున్నారు. సంగం , నెల్లూరు బ్యారేజీల పనులు పూర్తి కాకపోవడంతో నెల్లూరు డెల్టాకు కూడా నీరు వదలడంతో ఆయా ప్రాంతాల్లో కాలువలు పొంగి పొర్లుతున్నాయి . కొన్ని చోట్ల రహదారులపైకి కూడా నీరు వస్తుంది. ఓ వైపు భారీ వర్షాలు , సోమశిల నుంచి విడుదలవుతున్న నీరు జిల్లా అంతటా జలమయమైంది . అయితే ఈ వర్షాలు రానున్న రబీకి మంచిదేనని దుక్కులు దున్నుకునేందుకు భూమి బాగా చేపుకుంటుందని రైతన్నలు తెలియజేశారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతింటున్న రహదారులు
జిల్లాలో దాదాపు 10 సంవత్సరాల నుంచి రహదారుల నిర్మాణం సక్రమంగా చేపట్టలేదు. గతంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేశారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు తోడు కాలువలు నిండిపోయి రహదారులపై నీరు చేరుతుండడంతో జిల్లా అంతటా రోడ్లు దారుణంగా దెబ్బదింటున్నాయి . అకాలంగా ఏర్పడుతున్న గోతులతో అవగాహన లేని వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాగా , రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రహదారుల నిర్మాణానికి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో వర్షాలు పూర్తయిన తర్వాత రహదారుల నిర్మాణం , మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందని ఆర్అండ్బీ అధికారులు తెలియజేశారు.
6న మరో అల్పపీడనం హెచ్చరికలు
జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతుండగా , బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 6వ తేదీన మరో అల్పపీడనం చోటు చేసుకునే అవకాశం ఉందని , ఆ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తుండడంతో జిల్లా ప్రజల గుండెల్లో ఆందోళన ఏర్పడుతుంది . ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు గత 15 రోజులుగా వేటకు వెళ్లడం లేదు. ప్రస్తుతం కూడా వేటకు వెళ్లవద్దని అధికారులు చెబుతుండడం ఇదే పరిస్థితి మరో 10 రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో రెక్కాడితే కాని డొక్కాడని , తమకు పస్తులు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జిల్లా అంతటా జలమయం కావడంతో దోమల ఉధృతి పెరిగి ప్రజలకు విషజ్వరాలు , అంటు వ్యాధులు