అమరావతి, ఆంధ్రప్రభ: పశ్చిమ మధ్య బంగాళాఖాతము లో ఏర్పడి మచిలీపట్టణం, నర్సాపూర్ కి మధ్య తీరం దాటిన అసని తుఫాను తీవ్ర వాయుగుండము నుంచి బలహీనపడి గురువారం ఉదయం 8.30 గంటల సమయానికి మరింత బలహీనపడి వాయుగుండము గా మారి తీవ్ర అల్పపీడనంగా మారింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
తీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో గాలులు వీచాయి. రాష్ట్రం లోని ఉత్తరకోస్తా మరియు యానంలలో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లో తేలికపాటి వర్షాలు చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి