Thursday, December 12, 2024

Nandyala | శ్రీశైలం డ్యాంపై అక్టోపస్ బలగాల మాక్ డ్రిల్

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 12 : రాష్ట్రంలోని తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ శ్రీశైలం డ్యాం నిర్మాణం జరిగినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో తీవ్రవాదులు అనేక వాటిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా శ్రీశైలం ప్రాజెక్టుపై తీవ్రవాదులు దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మంగళగిరి ఆక్టోపస్ పోలీస్ బలగాలు బుధవారం అర్ధరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి.

మంగళగిరి ఆక్టోపస్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో 42మంది ప్రత్యేక టీం ఈ బృందంలో పాల్గొన్నారు. ప్రత్యేక దళాలకు ఎస్పీ ఆధ్వర్యంలో ఈ టీం అత్యదునిక ఆయుధాలతో మాక్ డ్రిల్ నిర్వహించాయి. శ్రీశైలం డ్యాం ఘాట్ రోడ్డు సమీపంలోని వ్యూ పాయింట్ నుంచి కొండలు గుట్టలు దిగుతూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అక్టోపస్ పోలీస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం సమీపంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రక్షించాలి అంశాలపై దృష్టి పెట్టారు.

తీవ్రవాదులు ఎలా వ్యవహరిస్తే ఎలా వారిని ఎదుర్కోవాలనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యాధునిక ఆయుధాలు ఉపయోగిస్తూ చాక‌చక్యంగా వ్యవహరిస్తూ తీవ్రవాదులను ఎలా మట్టుబెట్టాలి, ఎలా అధికారులను, ప్రజలను రక్షించాలనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రముఖ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడం విశేషం. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినా తీవ్రవాదులను ఎలా ఎదుర్కోవాలనే అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు ఆక్టోపస్ దళాలు ఆధునికరణతో నూతన ఆయుధాలతో ఆధునికంగా పరిస్థితులను బట్టి వివరించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement