Tuesday, November 26, 2024

పశువైద్యం కోసం మొబైల్‌ అంబులెన్స్‌ క్లినిక్స్‌.. ముస్తాబవుతున్న 175 వాహనాలు

అమరావతి, ఆంధ్రప్రభ : పాడి, పశు సంవర్ధక రంగంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుడుతూ అంబులెన్సుల రూపంలో సంచార వైద్యశాలలు త్వరలోనే అందుబాటు-లోకి రాబోతున్నాయి. సంచార పశు ఆరోగ్య సేవా రథాలు (మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌)గా పిలిచే 175 అంబులెన్సులు తొలివిడతలో రాష్ట్రంలో సేవలందించేందుకు ముస్తాబతున్నాయి. ఈ నెలాఖరులోపు అంబులెన్సుల సేవలను అందుబాటు-లోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు- చేస్తున్నారు. 108,104 తరహాలోనే ఈ అంబులెన్సులకు 1962 టోల్‌ ఫ్రీ నెంబరును కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 175 అంబులెన్సులను ఏర్పాటు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం కూడా 165 అంబులెన్సుల కొనుగోలు కోసం రూ 75.24 కోట్లు విడుదల చేసింది.

మొబైల్‌ వెటర్నరీ క్లినిక్స్‌ లను అన్ని రాష్ట్రాల్ల్రో అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయస్థాయిలో వినియోగిస్తున్న 1962 టోల్‌ ఫ్రీ నెంబరునే కేటాయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటు-తో మొత్తం 340 అంబులెన్సులు వినియోగంలోకి వస్తుండగా తొలివిడతలో 175 మొబైల్‌ క్లినిక్స్‌ ల ద్వారా సేవలందనున్నాయి. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికి ఒక మొబైల్‌ అంబులేటరీ క్లినిక్‌ ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది. అంబులెన్స్‌ కొనుగోలుతో పాటు- రెండేళ్ల నిర్వహణకు గాను ఒక్కొక్క వాహనానికి రూ 45.6 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement