తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : కులసమీకరణలలో భాగంగా తిరుపతికి చెందిన రష్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి కలిగిన డాక్టర్ సుబ్రమణ్యం 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా శ్రీ కాళహస్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర కమిటీ పదవుల్లో కొనసాగారు. గత వారమే బీసీలకు తగిన గుర్తింపు లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆపై వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అమలు చేసిన కులసమీకరణలో వన్నె రెడ్డి కులస్తుడైన డాక్టర్ సుబ్రమణ్యం బీసీ కోటాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి అభ్యర్తిత్వం వరించింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 90 శాతం స్థానిక సంస్థల పదవుల బలం ఉండడంతో ఆయన గెలుపు లాంచనమేనని స్పష్టమవుతోంది. అయితే ఆ గెలుపు ఏకగ్రీవంగా లభిస్తుందా, ఎన్నికల ద్వారా లభిస్తుందా అనే విషయం మాత్రం తేలాల్సివుంది. ఆ విషయం తేలాలంటే స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానం నామినేషన్ల స్వీకరణ ముగిసేదాకా వేచి ఉండాల్సిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement