అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో అనంతపురం కడప కర్నూలు పశ్చిమ రాయలసీమ పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉదయమే ఓటు వేయడానికి తరలివచ్చారు. పశ్చిమ రాయలసీమ పట్టబదుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాంగోపాల్ రెడ్డి, వైసీపీ నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి, పిడిఎఫ్ అభ్యర్థిగా పోతుల నాగరాజు బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ నుంచి రామచంద్రారెడ్డి, పిడిఎఫ్ తరఫున కత్తి నరసింహారెడ్డి పోటీ పడుతున్నారు. టిడిపి తన అభ్యర్థి ఎన్నికలో నిలపలేదు. దీంతో పిడిఎఫ్ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పరిశీలించారు.
పోలింగ్ బూత్ లోకి వెళ్లే మునుపు మహిళా ఓటర్లను త నికి చేసేందుకు నియమించిన మహిళా పోలీసులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఓటర్ల గుర్తింపు కార్డులను చేక్ చేశారు.
పోలింగ్ కేంద్రం పరిసరాలలో నియమించిన పోలీసు బందోబస్తును సమీక్షించి నియమ నిబంధనల ప్రకారమే పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.