అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు ఆరంభం మాత్ర మేనని , భవిష్యత్తు లో వచ్చేది సునామీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ద్వారా పులివెందులలో తమ అభ్యర్ధి గెలిస్తే జగన్ ఓడిపోయారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్సీల అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 72 గంటల పాటు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఫలితం కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. చివరకు తమ అభ్యర్ధి రామ్ గోపాల్ రెడ్డి గెలుపొందినా డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా అధికారులను వైకాపా అడ్డుకుం దని విమర్శించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు కూడా ప్రభుత్వ నేరాల్లో భాగస్వా ములు అవుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియామకం పై సుప్రీం కోర్టు సూచించిన కొత్త విధానం అమల్లోకి రావాలని చంద్రబాబు అన్నారు. మరో వైపు జీవో నెం. 1 తీసుకువచ్చి ప్రతిపక్షాలను, ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి జీవోలు ఎవరు తేలేదని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చట్ట సభల్లో సభ్యులపై దాడులు జరుగలేదని, అయితే ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యే డీవిబీ స్వామి పై దాడి చేసి కొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తిరుగుబాటులో సైకోలు చట్ట సభల్లోకి రాకుండా పోతారని, ఇది గౌరవ సభ కాదని కౌరవ సభ అని తాను ఆనాడే చెప్పానన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మమ్మల్ని చంపేస్తారా , మేము రోడ్లపైకి వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని చంద్రబాబు హెచ్చరించారు. ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందని తాను ,ముఖ్యమంత్రి జగన్ ఎవరు శాశ్వతం కాదని అసెంబ్లిd శాశ్వితమని చెప్పారు. ఎమ్మెల్యే స్వామి పై దాడి చేసిన వారిని వదిలి పెట్టేది లేదని చట్ట సభల్లోకి అడుగు పెట్టకుండా చూస్తామని చంద్రబాబు సవాల్ విసిరారు. ఏదైనా పొరపాటు సభలో జరిగితే దానిపై మాట్లాడి సర్దుబాటు చేసి సభ్యులకు క్షమాపణ చెప్పించాలని, అటువంటి దానికి భిన్నం గా వ్యవహరించారని దుయ్యబట్టారు. వైకాపాను చూసి తాము బెదిరేది లేదని, ఎన్నో సంక్షోభాలు చూశామని అన్నిటికీ సమాధానం చెబుతామ న్నారు. స్పీకర్ నిస్సహాయంగా ఎందుకున్నారో చెప్పాలన్నారు. జీవో .1 తో పాటు ఎమ్మెల్యేలపై దాడిని విస్తృత పర్యటన ద్వారా ప్రజాక్షేత్రంలో ఎండగడతానని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలు, కష్టాలనైనా ఎదుర్కొం టామని పట్టు దలగా పని చేస్తామని చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్సీలు మూడు చరిత్రలను ఈ విజయానికి కృషి చేసిన నేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చంద్రాబాబు చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసే వైకాపా గెలిచేందుకు వీల్లేదని, అన్ని పార్టీలు పోరాటానికి కలిసి రావాలని కోరామని, అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, పీడీఎఫ్ , జనసేనలు సహకరిం చాయని చెప్పారు. ఈ పోరాటాన్ని పార్టీ నేతలు , ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు స్పూర్తిగా తీసుకుని భవిష్యత్ కోసం ముందడగు వేయాలని చంద్ర బాబు పిలుపునిచ్చారు. అనంతరం ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు చిరంజీవి రావు , కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి లను చంద్రబాబు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపి టీడీపీ అధ్య క్షుడు అచ్చెన్నా యుడు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.