Tuesday, November 19, 2024

MLA Vasanth Krishna Prasad – దెబ్బమీద దెబ్బ.. వైసీపీకి బిగ్ షాక్..

అధికార వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు చేర్పులు కలకలం రేపుతోంది. ఈ క్రమంలో వసంత క్రిష్ణ ప్రసాద్ కూడా పార్టీ వీడనున్నట్టు తెలుస్తోంది. ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. వైపీపీలో మార్పులు, చేర్పులతో దాదాపు 82 మంది ఎమ్మెల్యేలు తమ ప్రస్తుత నియోజకవర్గాల నుంచి మారుతున్నారు. ఇదే పార్టీలో గందరగోళానికి దారి తీస్తోంది. ఈ మార్పుల క్రమంలోనే వసంత కృష్ణ ప్రసాద్‌కు తాడేపల్లి నుండి ఆహ్వానం అందింది. క్యాంపు కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. అయితే.. ఆయన ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారని, 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని పార్టీ కార్యాలయానికి తెలియజేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

తాడేపల్లికి వెళ్లడానికి విముఖత..
తాడేపల్లికి వెళ్లడానికి వసంతకృష్ణ ప్రసాద్‌ విముఖత చూపించడానికి కారణం, టిక్కెట్ నిరాకరించే అవకాశం ఉండొచ్చనే అనుమానమేనని, ఒకవేళ అదే జరిగితే అవమానంగా ఉంటుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2024లో పోటీ చేయకూడదని ఆయన తీసుకున్న నిర్ణయంతో దీన్నుండి తప్పించుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక.. 2019 ఎన్నికలలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాను ఓడించడం ద్వారా ప్రాధాన్యం సంతరించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ వసంత నియోజకవర్గంలో వేలు పెడుతుండడంతో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రాబోయే 2024 ఎన్నికలలో మైలవరం టికెట్ కోసం జోగి రమేష్ పోటీలో ఉండడం కూడా మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

టీడీపీలో చేరతారనే ఊహాగానాలు..
వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్లడం ఇంకా ఊహాగానాలకే పరిమితం అయినా.. ప్రస్తుతం ఏపీలోని రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్య పరిణామాల్లో ఏదైనా, ఎప్పుడైనా జరగొచ్చనేది తెలుపుతుంది. మైలవరం రాజకీయ భవితవ్యం, రాబోయే ఎన్నికల్లో కృష్ణప్రసాద్ పాత్ర ఎలా ఉండబోతుందనేది తేలాలంటే.. కాస్త టైమ్ రాజకీయ పడుతుందని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement