Friday, November 22, 2024

AP: ఎమ్మెల్యే శ్రీదేవి కోడ్‌ ఉల్లంఘన.. షోకాజ్ నోటీసులు

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఫొటోలు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో హల్చల్ చేశాయి.

ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధం. దీంతో ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకి పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘనపై 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసును రెవెన్యూ అధికారులు ఆమెకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement