ఏపీ మంత్రి అవుతున్నందుకు షూటింగ్లు మానేస్తున్నట్లు MLA రోజా ప్రకటించారు. ఇకపై టీవీ, షూటింగ్ పాల్గొననని చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని, సీఎం జగన్ పై గౌవరం ఇంకా పెరిగిందన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు అని తెలిపారు. కానీ జగనన్న తనను రెండు సార్లు MLAగా గెలిపించి ఇప్పుడు మంత్రిని చేస్తున్నారని చెప్పారు. మహిళ పక్షపాత సీఎం కేబినెట్లో మంత్రిగా చేయడం తన అదృష్టం అని తెలిపారు. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా.. సినిమాలు, షూటింగ్లు బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్ ను స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తానన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తా ఆర్కే రోజా చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement