వరద బాధితులను తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదేశించారు. పిచ్చాటూరు మండలంలో రామగిరి పంచాయతీ ఎస్టీ కాలనీ పునరావాస కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి పునరావాసం పొందుతున్న గిరిజనులకు ఎమ్మెల్యే కోనేటి చేతులు మీదగా దుప్పట్లు పంపిణీ, బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం క్రింద వరద బాధితులకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది చెప్పారు. అనంతరం అరణీయర్ ప్రాజెక్టు విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితులుపై జె.ఈ లోకేష్ రెడ్డిని ఆరా తీశారు. వరద నీరు ఎంత వస్తుంది దిగువ కు ఎంతో వదులుతున్నారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సత్యవేడు నియోజకవర్గం పరిధిలో వరద బాధితులను తక్షణ సహాయక చర్యలు చెప్పట్టటాలని తహశీల్దార్ ఎంపిడివోలకు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ కూడా తాగునీరు, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చెపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.