Tuesday, November 19, 2024

సీపీఎస్ రద్దు ఎందుకు చేయడం లేదు?: గోరంట్ల

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్) రద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు విజ‌య‌వాడ‌లో చేపట్టిన ఆందోళ‌న‌లపై టీడీపీ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పుడు తెలియక ఇచ్చాము అని చెప్పడం హేయమైన చర్య అని విమర్శించారు. అరాచక ఆటవిక రాజ్యంలాగా తయారు అయిందన్నారు. రాజస్థాన్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేశాయని తెలిపారు. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల‌ని ఉపాధ్యాయులు అడిగితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. యూటీఎఫ్ ఆందోళనలపై ప్రభుత్వ వైఖరి సరికాదని అన్నారు. వారిపై దాడి అనేది ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement